కేంద్రమంత్రి జవదేకర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ


ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ బుధవారం జవదేకర్‌ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకొన్నారు.