రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా... కార్యదర్శులు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి పొందారు. మరికొందరు సంయుక్త కార్యదర్శులుగా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న రజత్ భార్గవ్, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్‌కుమార్... స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందారు.
అదే విధంగా... సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మి, ఉషారాణి, రామ్‌గోపాల్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా... జాయింట్ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్‌కుమార్ పదోన్నతి పొందారు. ఇదిలా ఉండగా... ఇంటర్ క్యాడర్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా ఏపీకి ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నాగాలాండ్, యూపీ క్యాడర్‌కు చెందిన.. మంజిర్ జిలానా సమూన్, తమీమ్ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్ లభించింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా మంజిర్ జిలానీ సమూన్, జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా తమీమ్ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.